Telugu News » Pat Cummins: టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది.. అతడి వల్లే గెలిచాం: ఆస్ట్రేలియా కెప్టెన్

Pat Cummins: టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది.. అతడి వల్లే గెలిచాం: ఆస్ట్రేలియా కెప్టెన్

దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది. తమ టీమ్ విజయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఆసక్తికర విషయాలను తెలిపాడు.

by Mano
Pat Cummins: Losing the toss was a good thing... We won because of him: Australian captain

వన్డే ప్రపంచకప్ 2023లో(World cup 2023) భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. తమ టీమ్ విజయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఆసక్తికర విషయాలను తెలిపాడు.

Pat Cummins: Losing the toss was a good thing... We won because of him: Australian captain

ఇదో అద్భుతమైన మ్యాచ్ అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌తో ఫైనల్ ఆడనుండటం మరింత స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ట్రావిస్ హెడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే తమకు అద్భుత విజయాన్ని అందుకున్నామని, మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని అన్నాడు.

‘డగౌట్‌లో కూర్చోవడం కంటే మైదానంలో మ్యాచ్ ఆడడం ఉత్తమం అని నేను భావిస్తున్నా. రెండు గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠ తర్వాత విజయం సాధించాం. ఇదో అద్భుతమైన మ్యాచ్. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే బంతి పాత బడిన తర్వాత పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించాం. కానీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే పేసర్లకు సహకరిస్తుందని ఊహించలేకపోయాం.’ అని కెప్టెన్ కమిన్స్‌ తెలిపాడు.

‘మా ఫీల్డింగ్ టోర్నీ ఆరంభంలో దారుణంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా ప్లేయర్స్ అద్భుతంగా చేశారు. 37 ఏళ్ల వార్నర్ డైవింగ్ చేయడం విశేషం. హెడ్ తీసిన వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లీస్ స్పిన్నర్‌లను ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టులో ప్రపంచకప్ ఫైనల్ ఆడిన అనుభవం కలిగింది. 2015 ప్రపంచకప్ ఫైనల్ నా కెరీర్‌కే హైలైట్. ఫైనల్‌కు ఇక వేచి ఉండలేం’ అని కమిన్స్ అన్నాడు.

You may also like

Leave a Comment