వైసీపీ (YCP) వల్ల రౌడీ మూకలు రాజ్యమేలుతున్నాయని జనసేన (Janasena) చీఫ్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) మండిపడ్డారు. మరో నాలుగు నెలలు భరిద్దామని ప్రజలకు సూచించారు. ఆ తర్వాత విశాఖలో భద్రతతో కూడిన హార్బర్‌ను తీసుకు వచ్చే బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. భవిష్యత్ మీదని దానికి జనసేన ముందుంటుంది హామీ ఇచ్చారు.
ఫిషింగ్ హార్బర్‌లో ఇటీవల అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోవడంతో నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. తాను ఇచ్చే డబ్బు కష్టాలను తీరుస్తుందని తాను నమ్మనని అన్నారు. కష్టం వస్తే జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడనే బావన, కష్టాల్లో బతకనిస్తుందన్నారు. తాను ఎప్పుడూ మత్స్యకారులను ఓటు బ్యాంక్‌గా భావించలేదన్నారు.
కష్టాల్లో మీకు మద్దతుగా నిలబడతామని చెప్పందుకు వచ్చానన్నారు. సుమారుగా రూ. 25 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. పరిమితి వలన న్యాయం చేయలేకపోతున్నానన్నారు. ప్రతి మత్స్యకారుడికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైసీపీని ఎదుర్కొనేందుకు బలం కావాలన్నారు. అవకాశాలను, వదులుకోకూడదని టీడీపీతో కలిసి వెళుతున్నానని వివరించారు.
ఖండ బలం, గుండె బలం ఎలా ఉండాలో మత్స్యకారున్ని చూసే నేర్చుకోవాలని చెప్పారు. గత కొంతకాలంగా చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. మత్స్యకారులను భయపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ కావాలా వద్దా అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలన్నారు. వైసీపీ వస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలిపారు. ఈ పారితోషకాలు కూడా రావని ఉద్దేశంతోనే, ప్రకటించానన్నారు.
ఈ సహాయం మీకు సరిపోకపోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అందిస్తూ మీరు ఎందుకు ప్రభుత్వాల దగ్గర దేహి అని చేయి చాపాలని ప్రశ్నించారు. గుజరాత్, కేరళ తరహాలో మన జట్టిలు మనమే నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. సాగర్ మాల కింద 150 కోట్లను కేంద్రం కేటాయిస్తే ఇప్పటికీ లైట్లు వెలిగించలేకపోయారని ఎద్దేవా చేశారు.