బీజేపీ(BJP)తో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) చర్చలపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చలకు కారణమేంటని ప్రశ్నించారు.
సీఎం జగన్(CM Jagan)పై గెలవలేక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బీజేపీని తెచ్చుకుంటున్నారని విమర్శించారు. 2014లో బీజేపీ రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు అన్నారని ఆయన తెలిపారు. 2019 వరకు కలిసి ఉండి చివరికి మోసం చేసిందని.. బీజేపీని తిట్టారని అన్నారు. పీఎం మోడీకి భార్యాపిల్లలు కుటుంబం లేని వ్యక్తి నాతో పోటీనా అని చంద్రబాబు విమర్శించారని చెప్పారు.
మళ్ళీ కలిసి పోటీ చేయటంపై చర్చలు ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఏ న్యాయం చేసిందో చంద్రబాబు చెప్పాలన్నారు. ఒక్కరిగా జగన్‌పై గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజీపీ, టీడీపీ చేసిన పాపాలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
బీజేపీ కొత్తగా రాష్ట్రానికి ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చిందా? రైల్వే జోన్, పోర్టు నిర్మాణం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మించిందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా? సిగ్గులేకండా జనం మధ్యకు ఎలా వస్తారో? సమాధానం చెప్పాలని పేర్ని నాని మండిపడ్డారు.