Telugu News » PM Modi: డెయిరీ రంగంలో ప్ర‌బ‌ల శ‌క్తిగా భార‌త్.. నారీశక్తి అద్వితీయం: ప్ర‌ధాని మోదీ

PM Modi: డెయిరీ రంగంలో ప్ర‌బ‌ల శ‌క్తిగా భార‌త్.. నారీశక్తి అద్వితీయం: ప్ర‌ధాని మోదీ

అహ్మ‌దాబాద్‌(Ahmadabad)లో గురువారం గుజ‌రాత్ స‌హ‌కార మిల్క్ మార్కెటింగ్ ఫెడ‌రేష‌న్ స్వ‌ర్ణోత్స‌వాల్లో ఆయన ప్ర‌సంగించారు. దేశంలో డెయిరీ రంగం భారత్ ప్రపంచంలోనే ప్రబలశక్తిగా అవతరించిందన్నారు ప్రధాని మోడీ.

by Mano
PM Modi: India as dominant power in dairy sector.. Women power is unique: PM Modi

దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శ‌క్తి అద్వితీయ పాత్ర పోషించింద‌ని  ప్రధాని మోడీ(PM Modi) అన్నారు. అహ్మ‌దాబాద్‌(Ahmadabad)లో గురువారం గుజ‌రాత్ స‌హ‌కార మిల్క్ మార్కెటింగ్ ఫెడ‌రేష‌న్ స్వ‌ర్ణోత్స‌వాల్లో ఆయన ప్ర‌సంగించారు. దేశంలో డెయిరీ రంగం భారత్ ప్రపంచంలోనే ప్రబలశక్తిగా అవతరించిందన్నారు ప్రధాని మోడీ.

PM Modi: India as dominant power in dairy sector.. Women power is unique: PM Modi

భార‌త్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంత‌రం చెందాలంటే మ‌హిళల ఆర్థిక శ‌క్తిని ముమ్మ‌రం చేయాల్సిన అవ‌స‌రం ఉన్నదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మ‌హిళ‌ల ఆర్థిక శ‌క్తిని పెంపొందించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. ఈరోజు ప్ర‌పంచంలోనే మ‌నం అతిపెద్ద పాల ఉత్ప‌త్తి దేశంగా ఎదిగామ‌ని  అన్నారు.

ప్ర‌భుత్వం మంజూరు చేసిన రూ.30ల‌క్ష‌ల కోట్ల విలువైన ముద్ర రుణాల్లో 70శాతం ల‌బ్ధిదారులు మ‌హిళ‌లేన‌ని చెప్పారు. దేశంలో ప‌దేండ్లుగా మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క గ్రూపుల‌కు చెందిన మ‌హిళ‌ల సంఖ్య 10కోట్లు దాటింద‌ని తెలిపారు.

భార‌త డెయిరీ రంగంలో ఎనిమిది కోట్ల మంది ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. మ‌న డెయిరీ ప‌రిశ్ర‌మ ట‌ర్నోవ‌ర్ రూ.10ల‌క్ష‌ల కోట్ల‌కు ఎదిగింద‌ని చెప్పారు. ఈ కార్యక్రమానికి 1.25 లక్షల మంది రైతులతో పాటు గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సహా ప్రముఖులు హాజరయ్యారు.

You may also like

Leave a Comment