అయోధ్య(Ayodhya)లో (Ayodhya) రామ్ లల్లా(Ram Lala)(బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో దేశమంతా రామనామాన్ని జపిస్తోంది. సోమవారం ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
500ఏళ్లకు పునర్నిర్మితమైన రామమందిర ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు పేజీల లేఖ రాశారు. దేశంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని ముర్ము పేర్కొన్నారు.
అదేవిధంగా రామ మందిర ప్రతిష్ఠాపన భారత అంతర్మాతకు ప్రతిబింబమని, ఆ ఘట్టాన్ని చూడటం భారతీయులందరీ అదృష్టమని తెలిపారు. ఆలయం కోసం ప్రధాని మోదీ చేసిన 11 రోజుల అనుష్ఠాన దీక్ష పవిత్ర కార్యక్రమమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా రాముని పట్ల ఆయనకు ఉన్న భక్తికి నిదర్శనమని ముర్ము ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందిస్తుంది. భారతదేశం మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుంది’ అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
माननीय @rashtrapatibhvn जी,
अयोध्या धाम में राम लला की प्राण-प्रतिष्ठा के पावन अवसर पर शुभकामनाओं के लिए आपका बहुत-बहुत आभार। मुझे विश्वास है कि यह ऐतिहासिक क्षण भारतीय विरासत एवं संस्कृति को और समृद्ध करने के साथ ही हमारी विकास यात्रा को नए उत्कर्ष पर ले जाएगा। https://t.co/GdPmx6cluS
— Narendra Modi (@narendramodi) January 21, 2024