Telugu News » Modi : బంధ ప్రీతి, రాజకీయ చక్రంలో కాంగ్రెస్ ఇరుక్కుంది….!

Modi : బంధ ప్రీతి, రాజకీయ చక్రంలో కాంగ్రెస్ ఇరుక్కుంది….!

బంధుప్రీతి, వంశపారంపర్య రాజకీయాల చక్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇరుక్కుపోయిందని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

by Ramu
PM Modi lays foundation stone for AIIMS Rewari

కాంగ్రెస్‌ (Congress)కు మోడీ వ్యతిరేక అజెండా మాత్రమే ఉందని ప్రధాని మోడీ (PM Modi) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బంధుప్రీతి, వంశపారంపర్య రాజకీయాల చక్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇరుక్కుపోయిందని తీవ్రంగా ఫైర్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీలో ఒకే కుటుంబం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.

PM Modi lays foundation stone for AIIMS Rewari

జైపూర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్-వికసిత్ రాజస్థాన్’అనే వర్చువల్ ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. సానుకూల విధానాలను రూపొందించే దూరదృష్టి కాంగ్రెస్‌కు లేకపోవడమే పెద్ద సమస్య అని విరుచుక పడ్డారు. భవిష్యత్‌ను కాంగ్రెస్ అంచనా వేయలేదని లేదా దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా లేదని ఎద్దేవా చేశారు.

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు యువత, మహిళలు, రైతులు, పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మోడీ వెల్లడించారు. అంతకు ముందు రేవాడీ ఎయిమ్స్, కొత్త రైలు మార్గం, మెట్రో మార్గం, మ్యూజియంతో సహా రూ.10,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను హర్యానాలో ప్రారంభించారు.

హర్యానాలోని రేవాడీలో ఎయిమ్స్ కు శంకు స్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ…….గత 10 సంవత్సరాల్లో భారత్ 11 వ స్థానం నుండి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి తనకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.

రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గతంలో అన్నదాతలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదని చెప్పారు. కానీ దానిపై తాము వారికి గ్యారంటీ ఇచ్చామని పేర్కొన్నారు. రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గతంలో శ్రీరాముడంటే ఊహ, అయోధ్యలో ఆలయనిర్మాణం వద్దన్న వాళ్లే ఇప్పుడు ‘జై సీతారామ్‌’అని నినదిస్తున్నారని వివరించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టించిందని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం దానిపై గ్యారెంటీ ఇచ్చి నెరవేర్చిందని గుర్తుచేశారు.

గత పదేండ్లలో భారత్‌ ఎన్నో నూతన శిఖరాలను అధిరోహించిందన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారని చెప్పుకొచ్చారు. 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని… మూడోసారి పాలనలో దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసేందుకు మీ ఆశీస్సులు కావాలని కోరారు.

You may also like

Leave a Comment