Telugu News » PM Modi: ‘సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం..’ ప్రధాని మోడీ ట్వీట్ వైరల్..!

PM Modi: ‘సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం..’ ప్రధాని మోడీ ట్వీట్ వైరల్..!

తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

by Mano
PM Modi: 'Let's bow to Sammakka-Sarakka..' Prime Minister Modi's tweet goes viral..!

తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ గిరిజన మహాజాతరకు తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు. ఈ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

PM Modi: 'Let's bow to Sammakka-Sarakka..' Prime Minister Modi's tweet goes viral..!

‘‘మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్క (Sammakka-Sarakka)లకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

జాతర సందర్భంగా కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.

సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధిచేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు.

 

You may also like

Leave a Comment