ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) తమిళనాడులో పర్యటస్తున్నారు. తిరుచిరపల్లిలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని (Sri Ranganatha Swamy Temple) దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో దేవస్థానం ఏనుగు ‘అండాళ్’ప్రధాని మోడీని ఆశీర్వదించింది.
దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కంబ రామాయణ శ్రవణం చేశారు. ప్రధాని కంబ రామాయణ శ్రవణానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనంతరం ప్రధాని మోడీ రామేశ్వరం బయలుదేరారు. అక్కడ స్వామి వారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. శనివారం ధనుష్ కోటిలోని కొత్తాండ రామస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఆ తర్వాత ధనుష్ కోటి సమీపంలో రామసేతు నిర్మాణానికి మూలం అని భావించే ప్రదేశంగా గుర్తించబడిన అరిచల్ మునైని కూడా మోడీ సందర్శిస్తారు. అంతకు ముందు ప్రధాని మోడీ రాక సందర్బంగా దారి పొడవునా ప్రజలు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా నిల్చున్న ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
తమిళనాడు రాజధాని చెన్నైకి ప్రధాని మోడీ శుక్రవారం చేరుకున్నారు. అక్కడ సాయంత్రం నిర్వహించిన ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం చెన్నైలోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిశారు. అనంతరం రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి రుద్రాక్ష మొక్కను నాటారు.