అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుపడి భారత రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్(B.R.Ambedkar) 67వ వర్థంతి నేడు. భారత చిరస్మరణీయమైన నాయకుల్లో ఒకరైన ఆయనకు ప్రధాని మోడీ(PM Modi) X(ట్విట్టర్) వేదికగా నివాళులర్పించారు.
‘‘పూజ్యులైన బాబా సాహెబ్ అంబేడ్కర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారు.. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి.. దళిత కుటుంబం నుంచి వచ్చి.. అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేడ్కర్ నిలిచారు’’ అంటూ ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956 డిసెంబరు 6న కన్నుమూశారు. బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో విద్యతో పాటు వారికి సరైన హక్కులను కల్పించడంలో సఫలమయ్యారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, రాజకీయవేత్త అలాగే, సంఘ సంస్కర్త కూడా. ఆయన జీవితాంతం దళిత జాతి సంక్షేమం, స్వేచ్ఛ కోసం కృషి చేశారు. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు.
అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు అంబేడ్కర్. భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఆయనే.న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధనలు చేసి దేశానికి ఎనలేని సేవలందించారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయన మరణానంతరం ప్రకటించింది.
पूज्य बाबासाहेब भारतीय संविधान के शिल्पकार होने के साथ-साथ सामाजिक समरसता के अमर पुरोधा थे, जिन्होंने शोषितों और वंचितों के कल्याण के लिए अपना जीवन समर्पित कर दिया। आज उनके महापरिनिर्वाण दिवस पर उन्हें मेरा सादर नमन।
— Narendra Modi (@narendramodi) December 6, 2023