ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరు (Bengaluru)లో హెచ్ఏఎల్ సెంటర్‌కు ఇవాళ ప్రధాని వెళ్లారు. అక్కడ తయారీ అవుతున్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల గురించి తెలుసుకున్నారు. తేజస్(Tejas) తయారీ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు.
తేజస్ యుద్ధ విమానంలో సక్సెస్‌ఫుల్‌గా విహరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయన తన X అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధ విమానంలో తాను పొందిన అనుభూతిని పంచుకున్నారు. ఈ అనుభవం అద్భుతంగా ఉందని పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘స్వదేశీ సామర్థ్యాన్ని పెంచాలన్న తన నమ్మకానికి బలం చేకూర్చింది. భారత్ శక్తి సామర్థ్యాల పట్ల నాకు గర్వంగా ఉంది. ఇది మన శాస్త్రవేత్తల కృషి, అంకితభావానికి నిదర్శనం, స్వావలంబనలో మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాబోమని సగర్వంగా చెప్పగలను.’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు తెచ్చుకుంది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థతో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. తేజస్ విమానాలకు చెందిన మాక్-3 ఇంజిన్లను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేస్తోంది.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO
— Narendra Modi (@narendramodi) November 25, 2023