భారతీయ జనతా పార్టీ(BJP) బీసీ ఆత్మగౌరవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Modi) నేడు తెలంగాణకు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని హాజరుకానున్నారు. ఈ సభలో ప్రధానితో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని బీజేపీ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి సీటుపై కోర్చోబెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలో బీసీ ఆత్మగౌరవ సభకు తెలంగాణ బీజేపీ నేతలు పూర్తి చేశారు. ప్రధాని మోడీని సాదరంగా ఆహ్వానించడానికి సాయంత్రం ఎయిర్‌పోర్టుకు బయల్దేరనున్నారు.
అదేవిధంగా, ప్రధాని సభకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ మరోసారి వేదిక కానుంది. ఈనెల 11న ప్రధాని మోడీ మరోమారు తెలంగాణ పర్యటనకు వస్తారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఎస్సీ అణగారిన వర్గాల సభ’లో ప్రధాని ప్రసంగిస్తారు. అందుకు తగిన షెడ్యూల్‌ను నిర్ణయించారు.
మంగళవారం సాయంత్రం 5.05గంటలకు యూపీ ప్రయాగ్ రాజ్ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకుంటారు. 5.10గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 5.25కు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.15 గంటలకు బయలు దేరి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. మోడీ మళ్లీ తెలంగాణకు 11వ తేదీన వస్తారు. ఎస్సీ అణగారిన వర్గాల సభలో పాల్గొంటారు.