Telugu News » Pm modi: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోడీ…!

Pm modi: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోడీ…!

ఢిల్లీలోని ద్వారక ‘యశో భూమి’లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో (ఐఐసీసీ) ప్రారంభించేందుకు ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం బయలు దేరారు.

by Ramu
PM Modi takes Delhi Metro ride to convention centre

ఢిల్లీలోని ద్వారక ‘యశో భూమి’(yasho bhoomi)లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో (IIcc) ప్రారంభించేందుకు ప్రధాని మోడీ(Pm modi) ఈ రోజు ఉదయం బయలు దేరారు. మార్గ మధ్యలో ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణించారు. ఆ సమయంలో మెట్రోలో ప్రయాణికులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ప్రధాని మోడీని చూసి ప్రయాణికులు సంతోషంతో పొంగిపోయారు.

PM Modi takes Delhi Metro ride to convention centre

చాలా మంది ప్రయాణికులు మోడీతో సెల్ఫీలు దిగి సంబుర పడిపోయారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిబ్బందితో ప్రధాని మోడీ మాట్లాడారు. అనంతరం ద్వారకా సెక్టార్ 21 నుంచి ద్వారక సెక్టార్ 25లోని నూతన మెట్రో స్టేషన్ వరకు ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ లైన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక యశో భూమి సెంటర్ ను 8.9 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సెంటర్ ను నిర్మించారు.

ఇందులో సమావేశాలు, కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్ వంటివి నిర్వహించేందుకు 1.8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సమావేశ మందిరాలు నిర్మించారు. ఇందులో 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లో ప్రధాన ఆడిటోరియం, ఒక బాల్ రూమ్, 13 సమావేశ మందిరాలు కలిపి మొత్తం 15 కన్వెన్షన్ రూమ్స్ వున్నాయి. ఇందులో మొత్తం 11,000 మంది ప్రతినిధులు హాజరయ్యేందుకు అనువుగా దీన్ని నిర్మించారు.

ఇందులో ప్రధాన ఆడిటోరియంలో 6000 మంది వరకు కూర్చునే సౌకర్యం ఉందని అధికారులు తెలిపారు. ఇక బాల్ రూమ్ లో 2500 మంది వరకు అతిథులు కూర్చునేలా, మరో 500 మందికి కూర్చునేందుకు వీలుగా అదనపు ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1,97 లక్షల చదరపు మీటర్లలో ఎగ్జిబిషన్ హాల్స్ ఉన్నాయన్నారు.

You may also like

Leave a Comment