ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ (BJP) అగ్రనేతలు బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ (PM Modi) చరిష్మా బాగా పని చేస్తుందని ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చరిష్మాను వాడుకుని మరోసారి ఆయా రాష్ట్రాల్లో విజయకేతనం ఎగుర వేయాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇది ఇలా వుంటే ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మంగళవారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. సభా వేదికగా బీఆర్ఎస్ సర్కార్ పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా బీసీ వ్యక్తిని సీఎం చేసే తీర్మానం ఇక్కడి నుంచే మొదలవ్వాలని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. అదే సమయంలో బీసీ వర్గాలు కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో పార్టీకి మైలేజీ పెరిగే సూచనలు కనిపిస్తున్నట్టు చర్చించుకుంటున్నాయి.
తాజాగా మరోసారి మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ నెల11న సాయంత్రం 4.45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోడీ దిగనున్నారు. అనంతరం 5 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోని సాయంత్రం 5.40వరకు 40 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.