Telugu News » PM Modi : ఉమెన్స్ డే గిఫ్ట్.. మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని..!

PM Modi : ఉమెన్స్ డే గిఫ్ట్.. మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని..!

ఇప్పటికే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

by Venu
BJP has a clear majority in both phases. If Congress opposes Modi's decisions, it will be a disaster!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రకటించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్ (Twitter) వేదికగా ప్రధాని పేర్కొన్నారు.

అదేవిధంగా ఇప్పటికే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అర్హులైన కొనుగోలుదారులకు ఆర్థిక సహాయం కొనసాగించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం, ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రతి LPG సిలిండర్‌ (Cylinder)కు రూ.300 సబ్సిడీ ప్రభుత్వం అందిస్తోంది.

సంవత్సరంలో 12 సిలిండర్లు రీఫిల్లింగ్ కోసం పొందేందుకు వీలు కల్పిస్తుంది. మరోవైపు వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, లక్షలాది కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడంగా భావిస్తున్నామని మోడీ తెలిపారు. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి మా నిబద్ధతకు అనుగుణంగా ఉందని ప్రధాన మంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా పేర్కొన్నారు..

You may also like

Leave a Comment