Telugu News » PM Modi : యూట్యూబ్‌లో ప్రధాని మోడీ రికార్డు….. అత్యధిక సబ్ స్క్రైబర్లు కలిగిన నేతగా…..!

PM Modi : యూట్యూబ్‌లో ప్రధాని మోడీ రికార్డు….. అత్యధిక సబ్ స్క్రైబర్లు కలిగిన నేతగా…..!

ప్రపంచంలో అత్యధిక యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు కలిగిన రాజకీయనేతగా ప్రధాని మోడీ ఘనత సాధించారు. ప్రధాని మోడీ తర్వాత ఈ జాబితాలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్స‌నారో రెండవ స్థానంలో ఉన్నారు.

by Ramu
PM Narendra Modi becomes first world leader to have 20 million YouTube subscribers

ప్రధాని మోడీ (PM Modi) మరో రికార్డు సృష్టించారు. తాజాగా ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్ల (Subscribers) సంఖ్య రెండు కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు కలిగిన రాజకీయనేతగా ప్రధాని మోడీ ఘనత సాధించారు. ప్రధాని మోడీ తర్వాత ఈ జాబితాలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్స‌నారో రెండవ స్థానంలో ఉన్నారు.

PM Narendra Modi becomes first world leader to have 20 million YouTube subscribers

బోల్సనారోకు 64 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. మూడవ స్థానంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానెల్ ను 11 లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ ఈ జాబితాలో 7.89 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. ట‌ర్కీ అధ్య‌క్షుడు రిసెప్ త‌యిప్ ఎర్డగోన్‌కు 3.16 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్లతో ఐదవ స్థానంలో ఉన్నారు.

ప్రభుత్వ ఛానెల్‌లో ప్రధాని మోడీ తన పర్యటనలు, ప్రసంగాలను పోస్టు చేస్తూ ఉంటారు. ఇక వ్యూవ్స్ విషయంలోనూ మోడీ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మోడీ ఛానెల్ కు 2.24 బిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక వ్యూవ్స్ కలిగి ఉన్న జెలెన్స్‌కీ కంటే 43 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.

మరోవైపు దేశంలో అత్యధికంగా సోషల్​ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు. సోషల్ మీడియా వెబ్​సైట్​ ఎక్స్ (ట్విట్టర్​)లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తుల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిలిచారు. మోడీ ట్విట్టర్​ ఖాతాను ఏకంగా 9 కోట్ల 15 లక్షలు, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 5.4 కోట్ల మంది ఫాలో చేస్తున్నారు.

యోగా విత్ మోడీ అనే యూట్యూబ్ ఛాన‌ల్‌లో కూడా మోడీకి ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఆ ఛాన‌ల్‌ కు 73 వేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛాన‌ల్‌కు 35 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2007లో మోడీ ఈ యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఆ ఛానెల్ కు సబ్ స్క్రైబర్స్ పెరుగుతూ వస్తున్నారు.

You may also like

Leave a Comment