మహారాష్ట్ర (Maharashtra)లో ఉన్న షిర్డీ సాయిబాబా (Shiridi Sai Baba)ఆలయం.. సాయిబాబా భక్తులకు పవిత్ర స్థలం. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు వస్తారు. అయితే బాబాను దర్శించకోవాలంటే భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది. మరోవైపు సెలవులు, పండుగల రోజుల్లో అయితే భక్తుల రద్దీ రికార్డు స్థాయిలో ఉంటుంది. భక్తులు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు కూడా లేవు.. ఇలా ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్న ఈ బాధల నుంచి భక్తులకు ఈనెల 26 నుంచి విముక్తి లభించనుంది.
భక్తుల సౌకర్యార్థం షిర్డీ సాయిబాబా సంస్థాన్ రూ.110 కోట్లతో కొత్త దర్శన్ క్యూ కాంప్లెక్స్, ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాగా ఒకేసారి 10 వేల మంది భక్తులకు ఈ కొత్త దర్శన్ క్యూ కాంప్లెక్స్‌లో వసతి కల్పించవచ్చని సాయి సంస్థాన్ తెలిపింది. ఈ కొత్త క్యూ కాంప్లెక్స్‌లో ఎయిర్ కండిషనర్లు, ఏసీ హాల్, బయోమెట్రిక్ దర్శన్ పాస్, వీఐపీ సిస్టమ్, క్యాటరింగ్, క్యాంటిన్ సౌకర్యం, టాయిలెట్లు, బుక్ స్టాల్, లడ్డూ ప్రసాదం ఒకేచోట అందుబాటులో ఉండేలా బాబా సంస్థాన్ చర్యలు తీసుకొన్నట్టు తెలిపారు.
మరోవైపు ప్రధాని (PM) నరేంద్రమోదీ (Narendra Modi) గుజరాత్ (Gujarat) ముఖ్యమంత్రి (Chief Minister)గా ఉన్నప్పుడు బాబాను దర్శించుకునేవారని సంస్థాన్ సీఈవో తెలిపారు.. కానీ దేశ ప్రధాని అయిన తర్వాత 2018లో అంటే ఐదు సంవత్సరాల తర్వాత బాబా సమాధిని దర్శించుకోవడానికి షిర్డీకి వస్తున్నారని.. సాయిబాబా సంస్థాన్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని సాయి సంస్థాన్ సీఈవో పి. శివశంకర్ తెలిపారు. మోదీ రైతులతో సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.