ప్రధాని నరేంద్ర మోడీ (PM MOdi) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ఆయన తెలంగాణ పర్యటనకు (Tealnagana Tour) రానున్నారు. అక్టోబర్ 2న పాలమూరులో నిర్వహించే బహిరంగ సభ (Public Meeting) లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటనకు బీజేపీ (Bjp) శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
బహిరంగ సభ నేపథ్యంలో భారీగా జన సమీకరణకు బీజేపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతలు పర్యటించాలని గతంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ లో పర్యటించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మం, చేవెళ్లలో పర్యటించారు.
ఈ ఏడాది వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోడీ మరోమారు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 29న ప్రధాని మోడీ నిజామాబాద్‌కు వస్తారని గతంలో బీజేపీ నేతలు వెల్లడించారు. కానీ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ప్రధాని మోడీ మూడు రోజులు ఆలస్యంగా రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
ఈ పర్యటనలో ఏవైనా అధికారిక కార్యక్రమాలు ఉంటాయా లేదా కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతారా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధాని రాక నేపథ్యంలో పాలమూరు జిల్లాలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ సభకు ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.