హోలీ(HOLI) పండుగ (మార్చి 25) ఉన్నందున ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్(HYDERABAD)లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు బహిరంగా ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని ముందస్తుగా సూచనలు చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రంగుల పండుగ నేపథ్యంలో అందరూ సామరస్య పూర్వంగా మెలగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం రంజాన్ త్యోహార్‌కు సంబంధించి రోజా(ఫాస్టింగ్)లు నడుస్తున్నాయి. ముస్లింలు అందరూ ప్రార్థనలు చేసుకుని బయటకు వచ్చే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, హోలీ పండుగ సందర్భంగా కొందరు ఆకతాయిలు రంగులు చల్లుతూ వెళ్తుంటారు. అలాంటివి మానుకోవాలని హితవు పలికారు.
దారిన పోయే వాహనాలు, ద్విచక్రవాహనదారులపై రంగులు చల్లరాదని ముందస్తుగా పోలీసులు హెచ్చరించారు. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఆ రోజు మద్యం షాపులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, కల్లు కంపౌండ్స్‌ను ఇప్పటికే మూసివేయాలని ఆదేశించినట్లు మూడు కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
ఎవరైనా నిబంధనలు అతిక్రమించినా, బహిరంగప్రదేశాలు, పబ్లిక్, మహిళలపై రంగులు చల్లి ఇబ్బందులకు గురిచేసినట్లు ఫిర్యాదులు అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు స్పష్టంచేశారు.