లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలైన బీజేపీ(BJP), కాంగ్రెస్(CONGRESS) నడుమ పొలిటికల్ వార్ నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సరికొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదాన్ని ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే దేశంలో విలువైన వాటిని వదులుకోవాల్సి వస్తుందని చెప్పకనే చెప్పారు.
అంతగా మోడీ ప్రస్తావించిన ముఖ్యమైన అంశం ఏంటంటే..1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కచ్చతీవు(KACCATEVU) ద్వీపాన్ని శ్రీలంకు అప్పగించింది. ఈ ద్వీపం రక్షణ పరంగా భారత్కు చాలా కీలకమైనదని ప్రధాని మోడీ చెప్పారు. యూపీతోని మేరఠ్ ర్యాలీలో కచ్చతీవును భారత ప్రధాని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, డీఎంకే పార్టీలపే ఫైర్ అయ్యారు.
స్వాతంత్ర్యం వచ్చాకే కచ్చతీవు మనదగ్గరే ఉండేదన్నారు. శ్రీలంక,తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైనదన్నారు. కానీ, ఆ ద్వీపం ఎందకు పనికిరాదని చెప్పి శ్రీలంకకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని సీరియస్ అయ్యారు. తమిళనాడు మత్య్సకారులు ఆ ద్వీపం వైపు వెళితే శ్రీలంక అధికారులు అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
మత్స్యకారుల బోట్లను శ్రీలంక అధికారులు జప్తు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న డీఎంకే లాంటి పార్టీలు కూడా దీనిపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వారి స్వార్థం కోసం తమిళ ప్రజల హక్కులను డీఎంకే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటువంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్చున ఖర్గే మండిపడ్డారు.