Telugu News » HISTORY : నెత్తురుని మరిగించే వీరత్వం.. 17మంది బ్రిటీష్ సైనికులను నరికి చంపిన 16ఏళ్ల బాలిక..!

HISTORY : నెత్తురుని మరిగించే వీరత్వం.. 17మంది బ్రిటీష్ సైనికులను నరికి చంపిన 16ఏళ్ల బాలిక..!

బ్రిటీషర్స్ పరిపాలనలో హింసకు, వివక్షకు గురైన ఎంతోమంది తెల్లదొరలకు ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి వారిలో కండలు తిరిగిన వీరులు, సామాన్య పౌరుల నుంచి నుంచి సాధారణ మహిళలు సైతం ఉన్నారు.

by Sai
Shaheed Shiv Devi's 14-year-old sister who revived her heroism.

బ్రిటీషర్స్ పరిపాలనలో హింసకు, వివక్షకు గురైన ఎంతోమంది తెల్లదొరలకు ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి వారిలో కండలు తిరిగిన వీరులు, సామాన్య పౌరుల నుంచి నుంచి సాధారణ మహిళలు సైతం ఉన్నారు. అయితే, భారత్‌లో సిపాయిల తిరుగుబాటు-1857 ప్రారంభం తర్వాత బ్రిటీషర్స్ ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వచ్చిందనేది చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో మలి స్వాతంత్ర్య ఉద్యమానికి బీజం పడిందని అంటుంటారు.

Blood-boiling heroism.. 16-year-old girl who cut and killed 17 British soldiers..!

10 మే 1857న దేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయ్యాక బిజ్రౌల్ నివాసి బాబా షహ్మల్ సింగ్ తోమర్ బ్రిటీషర్స్ ఆధీనంలో ఉండే ‘బరౌత్ తహసీల్‌’ను ఆక్రమించుకుని స్వాతంత్ర్యానికి ప్రతీకగా జెండాను ఎగురవేశాడు. అంతేకాకుండా బరౌత్ తహసీల్ ఖజానా నుండి దోచుకున్న సొమ్మును ఢిల్లీ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌కు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న తెల్లదొరలు బాబా షహ్మల్ సింగ్ కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

1857 జూలై 18న బర్కా గ్రామంలో షహీద్ బాబా షహమల్‌ను బ్రిటీష్ సైన్యం గుర్తించింది. వారితో పోరాడే క్రమంలో బ్రిటీష్ సైన్యం చేతిలో బాబా షహ్మల్ సింగ్ వీరమరణం పొందాడు. ఆ తర్వాత బ్రిటీష్ సైన్యం జరిపిన ప్రతీకారచర్యలో భాగంగా బారోట్ పట్టి చౌధరన్‌లోని ఇళ్లను కూల్చివేసి వాటిని ప్లాట్‌ఫారమ్‌లుగా మార్చారు. షహీద్ బాబా షహ్మల్‌కు మద్దతుగా నిలిచిన 32 మంది జాట్ తిరుగుబాటుదారులను బిజ్రౌల్ గ్రామం వెలుపల ఓ మర్రి చెట్టుకు ఉరితీశారు. ఆ విషాదకరమైన ఘటనను వీక్షించిన ప్రజలు తెల్లదొరల మారణకాండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

32 మంది జాట్ తిరుగుబాటు దారులను ఉరితీసినపుడు బారోట్‌కు చెందిన 16 ఏళ్ల ‘శివ్ దేవి తోమర్’ ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి. అది చూసిన ఆమె నెత్తురు మరిగిపోయింది. దీంతో బ్రిటీష్ సైన్యాన్ని ఆమె సవాల్ చేసింది. వారితో కయ్యానికి కాలు దువ్వింది. తన కత్తితో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 మంది బ్రిటీష్ సైనికులను ఊచకోత కోసింది. ఆమె వీరత్వానికి 25 మంది సైనికులు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారంటే అతిశయోక్తికాదు.

యుద్ధంలో భాగంగా గాయపడిన షాహీద్ శివ్ దేవి తన గాయాలకు మందు రాసుకుని చికిత్స పొందుతున్న క్రమంలో బ్రిటీష్ దళాలు ఆమెను చుట్టుముట్టాయి. అయినప్పటికీ గాయాలతోనే బ్రిటీష్ సైన్యంతో ఆమె పోరాడుతూ వీరమరణాన్ని ముద్దాడింది. కేవలం 16 ఏళ్ల వయసులో ఆమె ప్రదర్శించిన ధైర్యం, అలుపెరగని పోరాటం భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం.

ఆమె అత్యున్నత త్యాగం, శౌర్యం, బ్రిటీష్ వారితో ఒంటరిగా ఆమె చేసిన పోరాటం గురించిన ప్రస్తావన కూడా మన చరిత్ర పుటల్లో కనిపించలేదు. 16 ఏళ్ల షాహీద్ శివ్ దేవి శిక్షణ పొందిన బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచింది. 17 మంది బ్రిటీష్ సైనికులను ఊచకొత కోసిందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అసమానతలు లేకుండా ఆమె శౌర్యాన్ని, మాతృ భూమికి విశృంఖల బానిసత్వం నుంచి విముక్తి కల్పించేందుకు స్వాతంత్ర్యం కోసం పోరాడటమే బహుశా ఆమె జీవిత ఏకైక లక్ష్యం. ఇంత గొప్ప ధీశాలి గురించి చరిత్ర పుస్తకాల్లో ఎందుకు ప్రస్తావించలేదో మన చరిత్రకారులే సమాధానం చెప్పాలి.

You may also like

Leave a Comment