తెలంగాణా(Telangana State) రాష్ట్రంలో గవర్నర్ తమిళసై సౌందర రాజన్(Governor Tamilsai Soundara Rajan) ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమం ఎప్పటిలాగే చిన్నబోయింది. ప్రగతి భవన్(Pragati Bhavan)-రాజ్ భవన్(Raj Bhavan)మధ్య దూరం అలాగే కొనసాగింది.
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ తో పాటు అందరికి ఆహ్వానం పంపారు. కాగా తేనీటి విందుకు రాజకీయ నేతల ఎవరు రాకపోవడంతో.. రాజ్ భవన్ వెలవెలబోయింది.
మరోసారి ఈ తేనీటి విందు ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
ఇక, సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమాన్ని ఎగ్గొట్టారు.
ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్‌హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలకమైన నేతలు సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
గవర్నర్ తమిళిసై నిర్విహించిన ఎట్ హోం కార్యక్రమానికి కేవలం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ తో పాటు మరి కొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
అధికార, విపక్ష పార్టీలు సైతం ఎట్ హోం కార్యక్రమానికి రాకపోవడంతో రాజ్ భవన్ పరిసరాలు అంత హాడావుడిగా కనిపించడం లేదు. దీంతో రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య ఎప్పుడు సయోధ్య కుదురుతుందోనని పలువురు వాపోయారు.