బీఆర్ఎస్(BRS)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఫైర్ అయ్యారు. కేసీఆర్(KCR) హయాంలో అభివృద్ధి పేరుతో దోచుకుంది చాలదా? అంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా(Khammam District) వైరా(Vaira)లో ఆయన మాట్లాడుతూ.. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టారనిఅయినా బీఆర్ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అధిక వర్షాలతో పంటలు కొట్టుకుపోతున్నా కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సాగునీటికే కాదు తాగునీటికీ కరువు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పాలన వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంగా రైతన్నలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటుగా బీ టీమ్ బీజేపీకి కూడా కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్సే కరువు తెచ్చిందంటూ తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నిలువునా దోచుకున్నారంటూ ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, గత ఎన్నికల ముందు కేసీఆర్‌కు పొంగులేటి శ్రీనివాస్ చేసిన సవాల్ పూర్తిగా విజయవంతమైంది. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి చేసిన శపథం పన్నారు. ఆయన చెప్పినట్లుగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందింది.