సీఎం కేసీఆర్(CM KCR) తుపాకీ రాముడి కథలు చెప్పి రూ.లక్ష కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని కాంగ్రెస్ పార్టీ(Congress Party) పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి((Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తుపాకీ రాముడు కథలు చెప్పి రూ.లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్రాన్ని కోలుకోని విధంగా అప్పల పాలు చేశారని విమర్శించారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ రూ.ఐదు లక్షల కోట్ల అప్పు చేసాశారన్నారు. రాష్ట్రంతో గాంధీ కుటుంబానికి అనుబంధం ఉందని తెలిపారు పొంగులేటి. ‘ఒక్కసారి గెలిపించి పార్టీ మారిన వ్యక్తిని మళ్లీ గెలిపించి మన మీద కక్ష తీర్చుకోమని చెబుదామా’ అని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో డబ్బుల సంచులతో వస్తారని.. ఎంత అడిగితే అంత ఇస్తారన్నారు. టాక్స్‌లు కట్టిన డబ్బులు కొల్లగొట్టి ప్రజల దగ్గరకే తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇంత వరకు ఇవ్వకపోవడంతోనే ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు కనిపిస్తోందన్నారు. అబద్దాలు చెప్పేటప్పుడు తడుముకోకుండా చెప్పడంలో కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇద్దరు ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు.
సొల్లు మాటలు చెప్పే కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే ప్రజలు పరిమితం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందన్నారు. నిరుద్యోగుల ఆశలు అడిఆశలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటూ పొంగులేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.