Telugu News » Ponnam : బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు ఆపాలి!

Ponnam : బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు ఆపాలి!

ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్‌ ను వాడుకుంటున్న కేసీఆర్ అభివృద్ధి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని అడిగారు పొన్నం.

by admin
ponnam prabhakar in Husnabad

తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) హుస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఆదివారం హుస్నాబాద్ (Husnabad) లోని సబ్ స్టేషన్ పక్కన గల మైదానంలో జరిగే ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురగ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లాగా హుస్నాబాద్‌ ను ఇన్నాళ్లూ ఎందుకు అభివృద్ధి చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ponnam prabhakar in Husnabad

బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు పొన్నం. తమ మేనిఫెస్టో దిమ్మ తిరిగేలా ఉంటుందంటున్న బీఆర్ఎస్‌.. ఇదివరకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలే దిమ్మ తిరిగే తీర్పిస్తారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ తాయిలాలు తీసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు.

ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్‌ ను వాడుకుంటున్న కేసీఆర్ అభివృద్ధి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని అడిగారు పొన్నం. 2014కు ముందే 70శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును కూర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్.. ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదో బహిరంగ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య భూ నిర్వాసితులను అణిచివేసి కూడా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు.

నిరుద్యోగి ప్రవళ్లిక ఆత్మహత్య టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యేనని పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. పొత్తుల్లో భాగంగా గత ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం సీపీఐకి కేటాయించామని.. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ కు వదిలిపెట్టాలన్నారు.

You may also like

Leave a Comment