Telugu News » Ponnam Prabhakar: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. జీతాలపై కీలక ప్రకటన..!

Ponnam Prabhakar: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. జీతాలపై కీలక ప్రకటన..!

తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారం సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకే దరఖాస్తును అందిస్తోంది.

by Mano
Ponnam Prabhakar: Good news for employees and pensioners.. Key announcement on salaries..!

– స్వేద పత్రం కాదు.. సౌధ పత్రం రిలీజ్ చేయండి
– మీ ఆస్తులన్నీ బయటపెట్టండి
– ఎన్ని బంగ్లాలు కట్టారు..
– ఎన్ని ఫాంహౌస్‌ లు కట్టారు..
– వందల కోట్లు ఎలా దోచుకున్నారో చెప్పండి
– కేసీఆర్ కుటుంబంపై మంత్రి పొన్నం ఫైర్
– ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌ న్యూస్
– జీతాలపై కీలక ప్రకటన

బీఆర్ఎస్ స్వేద పత్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ప్రజా పాలనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందన్నారు.

Ponnam Prabhakar: Good news for employees and pensioners.. Key announcement on salaries..!

తెలంగాణ అప్పులపై స్వేద పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు, ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌధ పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి ఐదో తేదీ లోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని చెప్పారు.

జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజా పాలనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆలుగునూర్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతీ కుటుంబానికి ఆరు హామీలు వచ్చేలా ప్రభుత్వం దరఖాస్తు ఫారాలను అందిస్తుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారం సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకే దరఖాస్తును అందిస్తోంది. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు.

You may also like

Leave a Comment