Telugu News » Poonam Pandey: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి, మోడల్ పూనమ్ పాండే ఆకస్మిక మృతి..!

Poonam Pandey: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి, మోడల్ పూనమ్ పాండే ఆకస్మిక మృతి..!

నటి, మోడల్‌ పూనమ్ పాండే (Poonam Pandey) ఆకస్మికంగా మృతి చెందింది. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న పూనమ్‌ పాండే గురువారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని పూనమ్‌ టీమ్‌ ధ్రువీకరించింది.

by Mano
Poonam Pandey: Tragedy in the film industry.. Actress, model Poonam Pandey died suddenly..!

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ వివాదాస్పద నటి, మోడల్‌ పూనమ్ పాండే (Poonam Pandey) ఆకస్మికంగా మృతి చెందింది. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న పూనమ్‌ పాండే గురువారం రాత్రి తుదిశ్వాస విడిచింది.

Poonam Pandey: Tragedy in the film industry.. Actress, model Poonam Pandey died suddenly..!

ఈ విషయాన్ని పూనమ్‌ టీమ్‌ ధ్రువీకరించింది. ‘ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతిచెందారని తెలపడానికి బాధపడుతున్నాం’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌ పాండే.. 2013లో ‘నాషా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతూ వచ్చింది. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకి వస్తానని ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె వైవాహిక జీవితమూ అంత సాఫీగా సాగలేదు. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించింది.

ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. పూనమ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో మృతిచెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూనమ్ పాండే బాలీవుడ్, కన్నడతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించింది. పలు టీవీ షోల్లోనూ అలరించింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

You may also like

Leave a Comment