Telugu News » Prabhas Fan Died : యువకుడి ప్రాణం తీసిన అభిమానం.. సలార్ విడుదల రోజు అపశృతి..!!

Prabhas Fan Died : యువకుడి ప్రాణం తీసిన అభిమానం.. సలార్ విడుదల రోజు అపశృతి..!!

మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం.. ఆయన ప్రభాస్ వీరాభిమానని తెలిసిన వారు అంటున్నారు. కాగా మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక ప్రమాద సమాచారం అందుకొన్న ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

by Venu

ప్రభాస్ (Prabhas) అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ మూవీ (Salar Movie)మొత్తానికి రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా రెబల్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకొంటున్నారు.. మరోవైపు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందనే టాక్ వినిపిస్తోంది. కాగా సలార్ విడుదల రోజే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హద్దులు దాటిన అభిమానం ఓ వ్యక్తి ప్రాణం తీసింది.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్ (Current Shock)‏తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్‏ ఎదుట ఉన్న ఓ ఇంటిపై గురువారం ఫ్లెక్సీ కడుతూ బాలరాజు (27) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈఘటనతో బాలరాజు ఇంటిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకొన్నాయి..

మరోవైపు మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం.. ఆయన ప్రభాస్ వీరాభిమానని తెలిసిన వారు అంటున్నారు. కాగా మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక ప్రమాద సమాచారం అందుకొన్న ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా శుక్రవారం విడుదలకానుండడంతో ఫ్యాన్స్ అంతా ఖుషి ఖుషీగా ఫీల్ అవుతోన్నారు.

You may also like

Leave a Comment