ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని అయోధ్య(Ayodhya)లో నిర్మించిన రామ మందిరంలో వచ్చేనెల 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లను చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
రామ మందిర ప్రారంభోత్సవానికిపలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కేంద్రం ఆహ్వానిస్తోంది. ఈ మేరకు అయోధ్యలో నిర్వహించనున్న ఈ మహత్తర కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. తాజాగా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్.
ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ డియోల్, యశ్ సహా మిగిలిన బాలీవుడ్ తారలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రజినీకాంత్, మోహన్ లాల్, సంజయ్ లీలా భన్సాలీ, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుష్, రిషబ్ శెట్టి, మోహన్ లాల్‌కు ఆహ్వానించారు.
అయోధ్య రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, దేశ సంస్కృతిని ప్రతిబింబిచేలా నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నట్లు ఆర్కిటెక్ట్ ఆశీశ్ సోంపురా వెల్లడించారు. ఎంతపెద్ద విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకొని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేశామని తెలిపారు.