Telugu News » Chandrayan 3: విక్రమ్‌ నుంచి 100 మీటర్ల దూరంలో ప్రజ్ఙాన్‌: సోమనాథ్‌!

Chandrayan 3: విక్రమ్‌ నుంచి 100 మీటర్ల దూరంలో ప్రజ్ఙాన్‌: సోమనాథ్‌!

విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ సుమారు వంద మీట‌ర్ల దూరం వెళ్లిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

by Sai
pragyan rover moved 100 meters away from vikram lander said isro chief somnath

ఆదిత్య ఎల్1(Aditya l1), రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శ్రీహరికోట షార్ లో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్యా ఎల్ 1 ఉపగ్రహం పిఎస్‌ఎల్‌వి 57 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో ఆదిత్య ఎల్1 కోసం పని చేసిన శాస్త్రవేత్తలకు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.

pragyan rover moved 100 meters away from vikram lander said isro chief somnath

ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని సోమనాథ్ వెల్లడించారు. పిఎస్ఎల్వి తన పనిని విజయవంతంగా పూర్తి చేసిందని, ఉపగ్రహాన్ని వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 ప్రయాణం ప్రారంభమైందని, లెగ్రాంజ్ పాయింట్ దిశగా ఆదిత్య ఎల్1 ప్రయాణిస్తోందని తెలిపారు.

కాగా, ఆదిత్యా ఎల్1 ద్వారా సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు చేయనుంది. ఆదిత్యా ఎల్1 వ్యోమనౌక 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ కు దాదాపు 4 నెలల కాలంలో చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలోనే ఆయన చంద్రయాన్‌ 3 (Chandrayan 3) గురించి కూడా ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ సుమారు వంద మీట‌ర్ల దూరం వెళ్లిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆదిత్య ఎల్‌1 మిష‌న్ స‌క్సెస్ అయిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చంద్ర‌యాన్‌-3కి చెందిన అన్ని ప‌రిక‌రాలు స‌వ్యంగా ప‌నిచేస్తున్న‌ట్లు సోమ‌నాథ్ చెప్పారు.

ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌లు ఇంకా ఫంక్ష‌న్ చేస్తున్నాయ‌న్నారు. రోవ‌ర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో రోవ‌ర్‌, ల్యాండ‌ర్ల‌ను స్లీపింగ్ మోడ్‌లోకి తీసుకువెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

You may also like

Leave a Comment