Telugu News » Doctors Treatment under Mobile Torch Light: సెల్ ఫోన్ లైట్లతో ఆసుపత్రిలో వైద్యం

Doctors Treatment under Mobile Torch Light: సెల్ ఫోన్ లైట్లతో ఆసుపత్రిలో వైద్యం

అదే సమయంలో గుమ్మలక్ష్మీపురంలోని గోయిపాక గ్రామంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మొత్తంలో పది మంది గాయపడగా...అందులో ఇద్దరుకి తీవ్ర గాయాలయ్యాయి..

by Prasanna
POwer cut in Hospital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలపై రోజూ ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి సంఘటనే ఒకటి పార్వతీపురం జిల్లాలో జరిగింది.

POwer cut in Hospital

పార్వతీపురం-మన్యం జిల్లా కురుపాం మండలంలోని నిన్న రాత్రి 7 గంటల నుంచి కరెంట్ తీసేశారు. దాంతో కురపాం మండలమంతా అంధకారంలోనే ఉంది. అదే సమయంలో గుమ్మలక్ష్మీపురంలోని గోయిపాక గ్రామంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మొత్తంలో పది మంది గాయపడగా…అందులో ఇద్దరుకి తీవ్ర గాయాలయ్యాయి..

గాయలపాలైన వారందరిని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనాల్లో తరలించారు బాధితులు ఆసుపత్రికి చేరుకునే సమయానికి కరెంట్ లేదు. దీంతో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సెల్ ఫోన్ లైట్ల సహాయంతో చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కరెంట్ లేకపోవడంతో ఆసుపత్రిలోని రోగులు నానా అవస్థలు పడుతున్నామని, ఇటీవల ఈ విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయని రోగులు మండిపడుతున్నారు.

You may also like

Leave a Comment