Telugu News » Chandrababu Arrest: ఏపీలో చంద్రబాబు కోసం పూజలు, జైల్లో కలవనున్న పవన్, లోకేష్, బాలకృష్ణ

Chandrababu Arrest: ఏపీలో చంద్రబాబు కోసం పూజలు, జైల్లో కలవనున్న పవన్, లోకేష్, బాలకృష్ణ

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు, దీక్షలు చేపట్టింది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కుప్పంలో టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

by Prasanna
babu arrest

ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర: చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ (Arrest) కు నిరసనగా ఇవాళ కూడా ఏపీలో పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందోళనలు (Agitations), నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చాలా చోట్ల వీరి దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

babu arrest

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు, దీక్షలు చేపట్టింది. వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కుప్పంలో టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న దీక్షల్లో మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పాల్గొన్నారు. నెల్లూరులోని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యలయం వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి.

ఏలూరులో పలు ఆలయాల్లో చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకుంటూ టీడీపీ కార్యకర్తలు పూజలు చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు త్వరగా విడుదల కావాలని మొక్కుకున్నారు. మసీదులు, చర్చిల్లో కూడా ప్రార్థనలు చేశారు. ఇలా ఏపీలోని విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కృష్ణా జిల్లా పలు చోట్ల దీక్షలు, పూజలు జరుగుతున్నాయి.

మరో వైపు ఇవాళ చంద్రబాబును రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ లో కలవనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయలుదేరగా…పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకోనున్నారు. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

You may also like

Leave a Comment