Telugu News » Viral Video: అంబులెన్స్‌ లో డీజీల్ లేదు..రాదు..రోడ్డు పైనే మహిళ ప్రసవం!

Viral Video: అంబులెన్స్‌ లో డీజీల్ లేదు..రాదు..రోడ్డు పైనే మహిళ ప్రసవం!

డీజిల్ లేదు.. అంబులెన్స్ ఇప్పుడు రాదు అని చెప్పడంతో మహిళ బంధువులు కంగు తిన్నారు.

by Sai
pregnant women delivery in nirmal

చంద్రుని మీదకు చంద్రయాన్‌ వేసుకొని వెళ్తున్నాం కానీ..ఓ నిండు గర్భిణీ ప్రసవానికి మాత్రం అంబులెన్స్‌ ని పంపలేని స్థితిలో ఉన్నాం. సభ్య సమాజం సిగ్గు పడే ఘటన ఇది. ఈ దారుణమైన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

pregnant women delivery in nirmal

పెంబి మండలం తులసిపేట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీకి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో అంబులెన్స్ (ambulance) కు తన బంధువులు ఫోన్ చేశారు.

అసలు ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తనను స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించారు. అయితే.. రోడ్డు మీదికి వచ్చినప్పటికీ అంబులెన్స్ రాలేదు.

అంబులెన్స్(ambulance) కి ఎన్నిసార్లు కాల్ చేసినా డీజిల్ లేదని అంబులెన్స్ రాలేదు. మహిళను ఎలాగోలా బంధువుల సాయంతో వాగు దాటించి అంబులెన్స్ కి కాల్ చేశారు. అప్పటికీ 4 గంటలు అయినా అంబులెన్స్‌ జాడే లేదు. డీజిల్ లేదు.. అంబులెన్స్ ఇప్పుడు రాదు అని చెప్పడంతో మహిళ బంధువులు కంగు తిన్నారు.

చేసేది లేక రోడ్డు మీదనే ఆ మహిళకు ప్రసవం చేశారు. రోడ్డుపైనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. సుమారు నాలుగు గంటల పాటు రోడ్డు మీదనే ఆమె నరకయాతన అనుభవించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment