Telugu News » secretariat: సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవంలో కేసీఆర్‌, తమిళి సై!

secretariat: సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవంలో కేసీఆర్‌, తమిళి సై!

సర్వమత ప్రార్ధనల్లో కేసీఆర్, గవర్నర్ లు పాల్గొన్నారు.

by Sai
spiritual buzz in telangana secretariat

తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై (tamili sai) సౌందర రాజన్, సీఎం కేసీఆర్(kcr) పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయం నిర్మాణం సమయంలో ఇక్కడ ఉన్న నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను తొలగించారు.

spiritual buzz in telangana secretariat

నూతన సచివాలయంలో ఈ మూడు ప్రార్థన మందిరాలను (temples) నిర్మించింది ప్రభుత్వం. సచివాలయానికి నైరుతి దిశలో నల్ల పోచమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంతో పాటు గణపతి, ఆంజనేయస్వామి, సుబ్రమణ్యస్వామి ఆలయాలను కూడ నిర్మించారు.

గతంలో ఉన్న స్థలంలో మసీదులను నిర్మించారు. ఈ మసీదులకు సమీపంలోనే చర్చిని కూడ నిర్మించారు. ఇవాళ నల్లపోచమ్మ ఆలయం పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ లు పాల్గొన్నారు.సర్వమత ప్రార్ధనల్లో కేసీఆర్, గవర్నర్ లు పాల్గొన్నారు.

చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కేసీఆర్ , గవర్నర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ప్రసంగించారు.సచివాలయంలో మతసామరస్యాన్ని నెలకొల్పినట్టుగా చెప్పారు. గుడి, మసీదు, చర్చి ఒకే దగ్గర నిర్మించినట్టుగా తెలిపారు.

నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గవర్నర్, సీఎం.అనంతరం చర్చిని ప్రారంభించారు. చర్చిలో కేక్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , సీఎం కేసీఆర్ కట్ చేశారు.మసీదును ప్రారంభించిన తర్వాత ప్రార్ధనల్లో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. మసీదు ప్రారంభంతో పాటు ప్రార్ధనల్లో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు కూడ పాల్గొన్నారు.నిన్న సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పెండింగ్ బిల్లులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి చర్చించారని సమాచారం. అయితే అదే సమయంలో ఇవాళ తెలంగాణ సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రావాలని గవర్నర్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ సచివాలయంలో జరిగిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు

You may also like

Leave a Comment