రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 18 నుంచి హైదాబాద్ (Hyderabad)లో రాష్ట్రపతి శీతాకాల విడిది చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఐదు రోజుల పాటు బస చేస్తారు. ఈ క్రమంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకోనున్నారు. ఐదు రోజుల పాటు బొల్లారం రాష్ట్రపతి భవన్ లో ఆమె బస చేయనున్నారు. అనంతరం 23న తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. బొల్లారం రాష్ట్రపతి భవన్ కు ద్రౌపది ముర్ము రావడం ఇది రెండవ సారి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
బ్లూబుక్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యం, రోడ్లు భవనాలు, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖలకు సూచించారు. ప్రతి ఏడాది శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి బొల్లారానికి వస్తూ ఉంటారు. గత ఏడాది శీతాకాంలో ద్రౌపది ముర్ము తొలిసారిగా విడిది కోసం ఇక్కడకు వచ్చారు. ఆ సైమయంలో రాష్ట్రపతి నిలయాన్ని సామాన్యులు అన్ని రోజులు సందర్శించేలా అవకాశం కల్పించారు.
సాధారణంగా రాష్ట్రపతి బస చేసే రోజుల్లో మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో ఈ చారిత్రక భవనాన్ని సామాన్య ప్రజలు సందర్శించే అవకాశం ఉంది. అంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒక ఏడాదిలో రెండు సార్లు బొల్లారం భవన్ లో బస చేశారు. శీతాకాలంతో పాటు ఆయన వర్షాకాల విడిది కూడా బొల్లారం చేశారు.