ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని (Democracy) బలోపేతం చేయాలని తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు హక్కు పొందిన వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణ సోదర, సోదరీమణులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇరువురు నేతలు కోరారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణ సోదర సోదరీమణులారా తరలిరండి… అధిక సంఖ్య ఓటింగ్ పాల్గొనండని పిలుపు నిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ట్వీట్ చేశారు. తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఓటు వేయడం ప్రజల హక్కు అని తెలిపారు. అది మీ అతిపెద్ద బాధ్యత కూడా అని గుర్తు చేశారు. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండని కోరారు. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్ ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.