Telugu News » Priyanka : కేసీఆర్ బీజేపీతో పూర్తిగా ములాఖత్ అయ్యారు….!

Priyanka : కేసీఆర్ బీజేపీతో పూర్తిగా ములాఖత్ అయ్యారు….!

బీఆర్ఎస్ సర్కార్ ను మోడీ రిమోట్ తో నడిపిస్తున్నారంటూ ప్రియాంక గాంధీ ఆరోపించారు.

by Ramu
priyanka gandhi

కేసీఆర్ (CM KCR) పూర్తి స్థాయిలో బీజేపీ (BJP)తో ములాఖత్ అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ను మోడీ రిమోట్ తో నడిపిస్తున్నారంటూ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ములుగు జిల్లాలో నిర్వహించిన విజయభేరి సభలో ఆమె పాల్గొన్నారు.

priyanka gandhi fire on brs and bjp in vijay bheri sabha in mulugu

ఈ సభలో ఆమె మాట్లాడుతూ…. రామప్పకు రాగానే ఆలయాన్ని దర్శించుకున్నామన్నారు. చాలా సుందరమైన మందిరమని తెలిపారు. ఈ భూమి చాలా పవిత్ర భూమి అన్నారు. ఇక్కడ ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారని అన్నారు. ఇది వీరుల భూమి అని అన్నారు.

శ్రీకాంత చారిని ఈ సందర్బంగా ఆమె తలుచుకున్నారు. మీరంతా తెలంగాణ స్వప్నాన్ని చూశారని అన్నారు. ఈ స్వప్నం ప్రగతి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం గురించి అన్నారు. మీ స్వప్నలు ఫలిస్తాయని గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించారని అన్నారు. రైతులకు సాధికారత వస్తుందని, ఆత్మహత్యలు ఆగిపోతాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారని అన్నారు.

మీ స్వప్నం గురించి కాంగ్రెస్ అర్ధం చేసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం నుంచే పుట్టిందన్నారు. స్వాతంత్ర్య కాలం నుంచి దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తించిందన్నారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు.

తెలంగాణ ఇస్తే రాజకీయంగా కొంత మూల్యం ఇవ్వాల్సి వస్తుందని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినా, రాకపోయినా పర్వాలేదని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. నెహ్రూ, ఇందిరాలు ప్రజల ఆకాంక్షల కోసం దూరదృష్టితో ఎలా నిర్ణయాలు తీసుకున్నారో సోనియాగాంధీ కూడా అలానే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

గత కాంగ్రెస్ హయాంలో ఐఐటీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏర్పడ్డాయన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజా ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నీతి. నిజాయితీతో కట్టుబడి ఉంటాయన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ తయారు చేసి ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పారు.

మీ ముందుకు ఆరు గ్యారెంటీలు తీసుకు వస్తున్నామని చెప్పారు. తెలంగాణలో తాము అధికారంలో వచ్చాక ఏం చేయబోతున్నామో అందులో చెప్పామన్నారు. ప్రజలు ఎంత కష్టపడుతున్నారో తనకు తెలుసన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 40 లక్షల మంది పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. ఇంటింటికో ఉద్యోగం అన్నారు కానీ బీఆర్ఎస్ ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదన్నారు.

ఉద్యోగాల నింపే ప్రక్రియలో బీఆర్ఎస్ అవినీతి చేస్తోందన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ఉస్మానియా లాంటి వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. టీఆర్ఎస్ వచ్చాక ఒక్క ప్రభుత్వ వర్సటీ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. రెండు ప్రైవేట్ వర్శిటీలను తీసుకు వచ్చిందన్నారు.

తాము అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఇస్తామని చెప్పారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రైతు పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.

ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ. 15వేలు అందిస్తామన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అంబేడ్కర్ అభయ హస్తం కింద దళిత కుటుంబాలకు రూ. 12 లక్షల సహాయం అందజేస్తామని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలంతో పాటు రూ. 6 లక్షల సహాయం అందజేస్తామన్నారు. ఆదివాసీ గ్రామపంచాయతీలకు రూ. 25 లక్షలు ఇస్తామన్నారు. . ఏ అవకాశం దొరికినా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములను కబ్జా చేశారని అన్నారు.

కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు మంత్రులు ఉంటే వాళ్ల దగ్గరే 13 శాఖలు వున్నాయన్నారు. కుల గణనకు ప్రధాని మోడీ ఒప్పుకోవడం లేదన్నారు. కులాల లెక్కలు లేకపోతే న్యాయం ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజన వర్శిటీ, ఉద్యానవన వర్శిటీ పెడతామని మోడీ అన్నారని చెప్పారు. కానీ ఆ విషయంలో అడుగు ముందుకు పడలేదన్నారు.

 

You may also like

Leave a Comment