కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మంగళవారం తెలంగాణ (Telangana)లో పర్యటించనున్న విషయం తెలిసిందే.. ఇందుకోసం పార్టీ నేతలు ఇప్పటికే సిద్దం అయ్యారు. కాగా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యిందని తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టూర్ క్యానిల్స్ అయినట్లు స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ వెల్లడించారు.
మరోవైపు రేపు టీ కాంగ్రెస్ చేవెళ్ల (Chevella)లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని ఇప్పటికే టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు సభకు సైతం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అంతేకాకుండా ఈ సభలో ఆరు గ్యారెంటీల్లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లను ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఈ క్రమంలో చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ టూర్ రద్దు అయ్యింది. దీంతో రెండు పథకాల ప్రారంభంపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా చేవెళ్ల సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఇచ్చారు.. ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నందున ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని కోరారు. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కానీ ఊహించని విధంగా ఈ సభ క్యాన్సిల్ కావడంతో క్యాడర్ కాస్త నిరాశలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. సభ కోసం అంతా సిద్దం అయ్యాక ఇలా నిరాశ మిగలడం.. మరోవైపు మంగళవారం నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు అవుతుందనే ప్రచారం జరగడంతో ప్రజలు ఈ అంశాన్ని ఎలా స్వీకరిస్తారో అనే టెన్షన్ పార్టీ వర్గాలలో మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది.