హైదరాబాద్ (Hyderabad)లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వనీయ సమాచారం మేరకు నగరంలోని ఫార్చ్యూన్ హోటల్ (Fortune Hotel) పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ గుట్టు చప్పుడు కాకుండా మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వ్యవహారమంతా రామ్ నగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 16 మంది అమ్మాయిలు, నలుగరు కస్టమర్లను, ఇద్దరు నిర్వాహకులను, లాడ్జీ యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
మహిళలను ముంబై, కోల్‌కతా ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరిట యువతలకు గాలం వేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. విచారణ నిమిత్తం వారిని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. అఖిల్ పహిల్వాన్ గత రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
అతడి ఫోన్‌లో జాతీయ. అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మియాపూర్‌లో స్పా సెంటర్ సీవైబీ ఏహెచ్ టీయూపై పోలీసులు దాడి చేశారు. నలుగురు పురుషులు, ఏడుగురు మహిళలను పట్టుకున్నారు.