ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీ రాజ్(Jana Sena leader, film actor Prithvi Raj). శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేశానని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21ఎంపీ సీట్లు రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ మంత్రి ఆర్కే రోజాదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ. అంతేకాదు.. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజా అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. మరోవైపు.. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలపై ఘాటుగా
స్పందించారు.
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా? అని ఎద్దేవా చేశారు. తన దగ్గర బ్రౌన్ కలర్‌లో ఓ డైరీ ఉందని, అందులో ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశానని పృథ్వీరాజ్ వెల్లడించారు.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ పిసినారి అని, జేబులో నుండి పైసా తీయరు అంటూ సెటైర్లు విసిరారు. జనసేన పార్టీ వెంటనే మెగా ఫాన్స్ అని పృథ్వీరాజ్ స్పష్టం చేశాడు. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ, టీడీపీ-జనసేన పార్టీలు సీట్ల కేటాయింపులో బిజీగా ఉన్నాయి. వైనాట్ 175 అంటూ అధికార వైసీపీ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో పృథ్వీ సర్వేపై చర్చనడుస్తోంది.