Telugu News » Purandeswari: ప్రధాని మోడీ నిర్ణయాలు ఓట్ల కోసం కాదు: పురంధేశ్వరి

Purandeswari: ప్రధాని మోడీ నిర్ణయాలు ఓట్ల కోసం కాదు: పురంధేశ్వరి

కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) పొత్తు వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.

by Mano
Purandeswari: PM Modi's decisions are not for votes: Purandeswari

ప్రధాని మోడీ(PM Modi) తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదని.. పేదల కోసమేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari) అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ(Deen Dayal Upadhyaya) వర్థంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు.

Purandeswari: PM Modi's decisions are not for votes: Purandeswari

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) పొత్తు వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. దీన్ దయాళ్ సిద్ధాంతాలను బీజేపీ తూచా తప్పకుండా పాటిస్తోందన్నారు. దేశంలో పారిశ్రామిక ప్రోత్సాహం, ఉపాధి కల్పన ఉండాలని దీన్ దయాళ్ చెప్పేవారని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో దేశాభివృద్ధి, ఉపాధి కల్పన లభిస్తుందనేది దీన్ దయాళ్ సిద్ధాంతమని తెలిపారు.

బీజేపీ తన ప్రస్థానాన్ని ఇద్దరు ఎంపీలతో ప్రారంభించిందని గుర్తుచేశారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.  స్వదేశీ, అంత్యోదయ వంటి నినాదాలను బీజేపీ కొనసాగిస్తున్నామని తెలిపారు. 2014కు ముందు ప్రతి రోజూ స్కాంల పర్వమే అన్నారు.

దాదాపు 15 స్కాంలు యూపీఏ హయాంలో జరిగాయన్నారు. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అంతా స్కీముల పర్వమే అని తెలిపారు. మంచి చేయాలనే మనస్సు ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని మోడీ నిరూపించారని తెలిపారు. బీజేపీ విధానాలు నచ్చి చాలా మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరే వారు కండువా వేసుకోవడమే కాకుండా సిద్దాంతాలను పాటించాలని సూచించారు.

You may also like

Leave a Comment