సీఎం కేసీఆర్(Cm Kcr) ఇచ్చిన మంత్రి పదవి వల్లే తుమ్మల నాగేశ్వర్‌రావు(Thummala Nageshwar Rao) రాజకీయాల్లో కొనసాగుతున్నారని, లేదంటే ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయేవారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvvada Ajaykumar) అన్నారు. సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై పువ్వాడ మండిపడ్డారు. కేసీఆర్ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని అన్నారు.
పదవుల కోసం తుమ్మల అధమస్థాయికి దిగజారారని.. కేసీఆర్ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరని పువ్వాడ అన్నారు. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తుమ్మల ఇప్పటికే రిటైర్ అయ్యేవారని విమర్శించారు. ‘తుమ్మలపై ఆధారపడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారా?.. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, తుమ్మల ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది’ హాస్యాస్పదమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు.
తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి.. ఉపేందర్‌రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తుమ్మలకు టికెట్ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన టికెట్ ఇచ్చి ఉండకపోతే సరిపోయేది కదా అని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడూ జైతెలంగాణ నినాదం చేయలేదని.. కానీ జైతెలంగాణ నినాదం చేసినవారిని తుమ్మల జైలు పాలుచేశారని పువ్వాడ ఆరోపించారు.
అదేవిధంగా బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శుక్రవారం సీఎం కేసీఆర్ మాటలను విని తుమ్మల నాగేశ్వరరావు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదన్నారు. పాలేరు ప్రజల సాక్షిగా తుమ్మలపై.. సీఎం మాట్లాడిన మాటలు వందశాతం నిజమేనని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నిపార్టీలు మారండి.. అది మీ ఇష్టమని చెప్పారు. కానీ ఆదరించి అభిమానించన వారిపట్ల తుమ్మల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.