గూఢచర్యం ఆరోపణలతో ఖతార్(Qatar)లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మాజీ నావికదళ అధికారులు(Ex-Navy Officers) ఎట్టకేలకు విడుదలయ్యారు. వారు దొహాలోని జైలు నుంచి సోమవారం ఉదయం విడుదలైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొంది.
విడుదలైన నేవీ అధికారుల్లో ఇప్పటికే ఏడుగురు భారత్‌కు చేరుకున్నట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్‌లోని అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు.
అయితే, భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ భారత అధికారులతో మాట్లాడేందుకు ఖతార్ ప్రభుత్వం అనుమతివ్వగా భారత విదేశాంగ శాఖ అధికారులు సంప్రదింపులు జరిపి, వారిని రక్షించేందుకు ప్రయత్నించింది.
మరణ శిక్ష విధించిన ఎనిమిది మందికి విముక్తి కల్పించాలని అధికారులు కోర్టులో అప్పీల్ వేశారు. స్పందించిన ఖతార్ న్యాయస్థానం ఇటీవలే మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది న్యాయస్థానం. ఖతార్ జైలు నుంచి విడుదలైన అధికారులు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మోడీ జోక్యం చేసుకోకపోతే తాము బయటకు వచ్చేవారిమి కాదని.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR
— ANI (@ANI) February 12, 2024