Telugu News » Ragging: వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థుల ఆందోళన..!

Ragging: వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థుల ఆందోళన..!

కాలేజీల్లో అడుగు పెట్టిన జూనియర్లకు ర్యాగింగ్‌(Raging) సంస్కృతి ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా కర్నూలు మెడికల్‌ కాలేజీ(Karnool Medical College)లో ర్యాగింగ్‌ ఘటన కలకలం సృష్టిస్తోంది.

by Mano
Ragging: Ragging in the medical college is disturbing.. Students are worried..!

చదువు, స్నేహాలు, కొత్త భావాలతో సృజనాత్మక కేంద్రాలుగా ఉండాల్సిన కళాశాలలు(Colleges) ర్యాగింగ్‌ నిలయాలుగా మారిపోయాయి. కాలేజీల్లో అడుగు పెట్టిన జూనియర్లకు ర్యాగింగ్‌(Raging) సంస్కృతి ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా కర్నూలు మెడికల్‌ కాలేజీ(Karnool Medical College)లో ర్యాగింగ్‌ ఘటన కలకలం సృష్టిస్తోంది.

Ragging: Ragging in the medical college is disturbing.. Students are worried..!

కర్నూలు మెడికల్‌ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ జూనియర్‌ విద్యార్థులు ఆరోపించడం చర్చనీయాంశమైంది. సీనియర్ల వేధింపులపై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. తమ రికార్డులు రాసి పెట్టాలని, తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై కలగజేసుకోవాలని, తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్‌ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు. ఇటీవలే కాలేజీ అనుబంధంగా ఉన్న మెన్స్‌ హాస్టల్‌లో గంజాయి, మద్యం సీసాలు బయటపడడం సంచలనం సష్టించింది. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈలోపే కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసీ.. ర్యాగింగ్ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. కాలేజీలో, విద్యార్థుల హాస్టల్స్‌లో ర్యాగింగ్ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

You may also like

Leave a Comment