Telugu News » Rahul Gandhi : రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ భేటీ…. కేదార్ నాథ్‌లో ఆసక్తికర ఘటన….!

Rahul Gandhi : రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ భేటీ…. కేదార్ నాథ్‌లో ఆసక్తికర ఘటన….!

అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్న ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నా దమ్ముల అనుబంధం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

by Ramu
Rahul Gandhi Meets His Cousin, BJP MP Varun Gandhi At Kedarnath

కేదార్‌నాథ్‌ (Kedarnath)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒకే చోట కలుసుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్న ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నా దమ్ముల అనుబంధం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Rahul Gandhi Meets His Cousin, BJP MP Varun Gandhi At Kedarnath

వరుణ్ గాంధీ యూపీలో ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. వారిద్దరూ కలుసుకోవడం అత్యంత అరుదు. కానీ వాళ్లిద్దరినీ ఇటీవల కేదారినాథ్ కలిపింది. గత మూడు రోజులుగా రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. పర్యటన ముగింపు నేపథ్యంలో కేదారి నాథ్ ఆలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.

అదే సమయంలో యూపీ నుంచి వరుణ్ గాంధీకి కూడా ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి వరుణ్ గాంధీ ఎదురు పడ్డారు. ఇరువురు నేతలు కాసేపు యోగక్షేమాలు విచారించుకున్నారు. వరుణ్ గాంధీ కుమార్తెను కలుసుకున్నందుకు రాహుల్ గాంధీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో రాజకీయాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇలా వుంటే గత కొంత కాలంగా బీజేపీ సమావేశాలకు వరుణ్ గాంధీ దూరంగా ఉంటున్నారు. పలు కీలక అంశాలపై కేంద్రాన్ని ఆయన విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

You may also like

Leave a Comment