హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కి మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ తన మాటలతో మోడీని ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. ప్రతి భారతీయుడు గుండెల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యాన్ని నింపారని పవన్ కళ్యాణ్ చెప్పారు తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపం మోదీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఆయన మరొకసారి ప్రధానమంత్రి అవ్వాలని చెప్పారు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా జనసేనకి బిజెపి మొత్తం ఎనిమిది స్థానాలని కేటాయించడం జరిగింది. జనసేనతో పొత్తు బిజెపికి లాభాన్నిస్తుంద లేదా అనేది చూడాల్సి ఉంది తెలంగాణలో జనసేన బిజెపితో పొత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు. ఈ క్రమంలో ఏపీలో బిజెపితో పొత్తు మాట ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. బిజెపితో జనసేన టిడిపి ప్రయాణం చేస్తాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also read:
మరి రాబోయే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీల వాళ్లు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ప్రజలకి దగ్గరవుతున్నారు. పార్టీ గురించి మీటింగ్ పెడుతున్నారు. ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీ నెగ్గుతుందా అని కూడా ఇప్పటికే పోల్ వేయడం వంటివి కూడా జరగాయి. రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళకి తగ్గ రీతిలో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు,