లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు రూ.లక్ష స్టైఫండ్‌తో మొదటి ఉద్యోగం అందించే కొత్త పథకాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో ఈ పథకం గురించి వెల్లడించారు. భారతదేశం బలం 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువత అని అన్నారు..
జనాభా పరంగా ప్రస్తుతం వీరి సంఖ్య ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలో ఉందని పేర్కొన్నారు.. అటువంటి యువత యొక్క అపారమైన శక్తితో భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి ఇది సమయం అని వెల్లడించారు.. ఇందుకోసం మేము త్రిమితీయ వ్యూహాన్ని రూపొందించామని తెలిపారు.. ఇందులో భాగంగా రిక్రూట్‌మెంట్ ట్రస్ట్ చట్టం 30 లక్షల నియామకాల ద్వారా ఉపాధిని కల్పిస్తుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు..
అంతేకాకుండా, ప్రభుత్వ నిర్మాణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు.. మరోవైపు పెహ్లీ నౌక్రి పక్కి పథకం కేవలం సంవత్సరానికి రూ. 1 లక్ష ఉద్యోగాలను కల్పించడమే కాదు.. ఇది భారతదేశంలో ఉన్న నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్యను అనేక రెట్లు పెంచుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరో పథకం యువ రోష్ణి.. దీనిద్వారా ప్రతి జిల్లాలో 5 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో పారిశ్రామికవేత్తలను సృష్టిస్తుందన్నారు..
ప్రస్తుతం దేశంలో ఉన్న యువశక్తిని సానుకూలంగా ఉపయోగించడం వల్ల భారతీయ పరిశ్రమలకు వెన్నెముక అయిన MSME లు బలోపేతం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి బాటలు పరుస్తాయని అన్నారు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాల కారణంగా భారతదేశం యొక్క అవకాశాల శకంలోని ముఖ్యమైన దశాబ్దం కోల్పోయిందని రాహుల్ తెలిపారు. ఇలాంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు..