Telugu News » Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

by Mano
Rain Alert: Low pressure in Bay of Bengal.. Heavy to very heavy rains..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 24గంటల్లో ఆంధ్రప్రదేశ్‌(AP)లో భారీ నుంచి అతిభారీ వర్షాలు(Rains) కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా పయనిస్తోందని వెల్లడించింది.

Rain Alert: Low pressure in Bay of Bengal.. Heavy to very heavy rains..!

అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వెళ్లడంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని, ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16 నాటికి మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, మహే, తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు మత్స్యకారులకు అలర్ట్ జారీ చేసింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

You may also like

Leave a Comment