Telugu News » Teaolangana: రాష్ట్రంలో వానలే వానలు!

Teaolangana: రాష్ట్రంలో వానలే వానలు!

గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD)మంగళవారం ప్రకటించింది.

by Sai
rains for another five days

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD)మంగళవారం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange) జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వాలింది.

rains for another five days

ఈ అల్పపీడనం 24 గంటల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గడ్‌ మీదుగా కదిలే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది.

You may also like

Leave a Comment