Telugu News » Rajagopal Reddy: అందుకే మళ్లీ సొంతగూటికి వచ్చేశా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy: అందుకే మళ్లీ సొంతగూటికి వచ్చేశా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ఈ రోజు ఉదయం రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని వీడడానికి గల కారణాలను వెల్లడించారు.

by Mano
Rajagopal Reddy: That's why I came home again: Komati Reddy Rajagopal Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly elections) హీట్ పెరుగుతోంది. ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో పార్టీల మధ్య నేతల బదిలీలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలామంది ఉన్న పార్టీ నుంచి మరో పార్టీకి మకాం మార్చేశారు. అయితే తాజాగా బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు.

Rajagopal Reddy: That's why I came home again: Komati Reddy Rajagopal Reddy

గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన రాజగోపాల్‌రెడ్డి ఆ తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరుపున పోటీచేయగా బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అప్పటి నుంచి బీజేపీలో కోమటిరెడ్డి అంత చురుకుగా ఉండడంలేదు. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగి సొంతగూటికి చేరారు.

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని వీడడానికి గల కారణాలను వెల్లడించారు. ‘కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. కేసీఆర్ అవినీతిని బీజేపీ అడ్డుకోలేక పోయిందని.. అందుకే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు’ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

కోమటిరెడ్డి ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉంది. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందే పార్టీలో సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావుడిగా గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డిల సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పగా రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

You may also like

Leave a Comment