ప్రత్యేక తెలంగాణ (Telangana) వస్తే పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోగా ఎక్కడో ఒక చోట గొడవలు జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఈ పోడు భూముల సమస్య రైతుల మధ్య నిప్పు రాజేసింది.
రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla) జిల్లా ఎర్రగడ్డ (YerraGadda) తండాలో పొడు భూముల విషయంపై రైతుల (Farmers) మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. భూమి పట్టా ఒకరి పేరుపై ఉంటే.. మరొకరు ఆ భూమని కబ్జా చేశారని ఒకరిని ఒకరు పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. తలలు పగిలి, రక్తం కారుతున్న కూడా కొట్టుకోవడం చూస్తుంటే సమస్య తీవ్రత అర్ధం అవుతోంది.
ఇక ఈ గొడవను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రక్షక భటులు వచ్చిన ఐ డోంట్ కేర్ అంటూ దాడి చేసుకొన్నారు రైతులు. ఈ దాడిలో భీమ్ జీ, చంద్రకాంత్ అనే రైతులకు తీవ్ర గాయాలవగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ తతంగం అంతా ఓ స్థానికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్త వైరల్ అయింది.